అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

టిల్లాబేరి ప్రాంతంలో ఉగ్రదాడి.. 37 మంది బలి!!

పశ్చిమ నైజర్‌లోని టిల్లాబేరి ప్రాంతంలో ఉన్న బానిబంగోలో పట్టపగలే సాయుధులు మరాణాయుధాలతో ఒక గ్రామంలోకి చొరబడి కాల్పుల మోత మోగించారు. చిన్నపిల్లలు, మహిళలని కూడా చూడకుండా విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దుండగుల బీభత్సానికి 37 మంది బలయ్యారు. మృతుల్లో 17 ఏళ్ల లోపు చిన్నారులు 13 మంది ఉన్నారు. నలుగురు మహిళలు కూడా మరణించారు. తుపాకులతో కొందరు సాయుధులు గ్రామంలోకి చొరబడి వస్తూ వస్తూనే కనిపించిన వారిందరిపైనా కాల్పులు జరపడంతో బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే కొంతమంది నెలకొరగగా ఆస్పత్రికి తరలించే లోపే మరికొందరు ప్రాణాలు కోల్పోయారు.

అభం శుభం తెలియని అమాయక పిల్లలను చంపడం దారుణమని యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి ముష్కర మూకల అంతానికి అన్ని దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •