వార్తలు (News)

సౌత్ ఇండియాలోనే అత్యంత ఎత్తయిన భావన నిర్మాణం!!

దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తయిన నివాస సముదాయాల భవన నిర్మాణాన్ని కోకాపేటలోని గోల్డెన్ మైల్ లేఅవుట్‌లో 57 అంతస్తుల భవనాన్ని( SAS Crown ) నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు బెంగళూరులోని 50 అంతస్తులను కలిగిన భావనమే ఎత్తైన భవనం గా ఉండగా ఇప్పుడు నిర్మించబోయేది దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తయిన భవనంగా నిలుస్తుందని భవన నిర్మాణ రంగ నిపుణులు పేర్కొన్నారు. దీని నిర్మాణం 4.5 ఎకరాల్లో జరుగుతుండగా, ఐదు టవర్లలో 235 ఇండ్లను నిర్మించబోతున్నారు. ఈ భవనం ఈ బిల్డింగ్‌ను SAS Infra నిర్మిస్తోంది. 57 అంతస్తుల భవన నిర్మాణానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ( HMDA ) అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం నిర్మాణ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. మొదటి దశ పనులు 2025 ఏడాది నాటికి పూర్తవుతాయని, ఈ భవనంలో ఒక చదరపు అడుగు రూ. 8,950ల ధర పలుకుతుందని, ఒక్క ఇల్లు రూ. 6 కోట్ల ఖరీదు ఉంది అని SAS Infra ప్రతినిధి ఆశీష్ భట్టాచార్య తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •