ఎన్నికలు (Elections) రాజకీయం (Politics) వార్తలు (News)

చంద్రబాబు కంచుకోటను బద్దలు కొట్టిన 23 ఏళ్ల యువతి!!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సొంత ఇలాఖా అయిన చిత్తూరు జిల్లా కుప్పం మండలం టీ సడుమూరు ఎంపీటీసీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుని టీడీపీకి షాక్ ఇచ్చింది. ఈ ఎన్నికలో 23 ఏళ్ల అశ్విని అనే యువతి 30 ఏళ్ల కుప్పం రాజకీయ స్వరూపాన్ని మార్చేయడంతో ప్రస్తుతం అశ్విని గెలుపు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. 1989 నుంచి కుప్పం మండలంలో ఎంపీపీ, జెడ్పీటీసీగా మరే పార్టీకి అవకాశం ఇవ్వకుండా టీడీపీ గెలుచుకుంటూ వస్తోంది. అలాంటి ముప్పై ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ అశ్విని రికార్డు సృష్టించింది. ఈ ఎన్నికలో వైసీపీ అభ్యర్థి అయిన అశ్వినికి 1240 ఓట్లు, టీడీపీ అభ్యర్థికి 70 ఓట్లు, ఇతరులు నోటాకు కలిపి 27 ఓట్లు వచ్చాయి. దీంతో 1073 ఓట్ల భారీ మెజార్టీతో వైసీపీ అభ్యర్థి అశ్విని గెలుపొందింది. చంద్రబాబు నాయుడు సొంత గ్రామమైన నారావారిపల్లెలోనూ టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గంగాధరం పరాజయం పొందారు. అక్కడ 1,347 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రాజయ్య గెలుపొందారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •