జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఆధార్‌లో తప్పులు మార్చుకోవడానికి ఛాన్స్!!

మన దేశంలో ప్రభుత్వ పరమైన ఎలాంటి పథకం అందుకోవాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి. ఇది లేనిదే ఏ పని కూడా జరుగదు. ఆధార్ వివరాలు లేకపోతే మాత్రం ఎలాంటి అప్లికేషన్లు జరగవు. అలాగే ఎలాంటి ప్రభుత్వ పథకాలు మనకు రావు. ఇలా ప్రభుత్వ పరమైన, ఇతర పనులకు అయితే కచ్చితంగా ఆధార్ అవసరం పడుతోంది. సిమ్ కార్డుల దగ్గరి నుంచి పాస్ పోర్టు వరకు అన్నింటికీ ఆధార్ ముఖ్యం. అయితే ఈ ఆధార్‌లో కూడా కొన్ని తప్పులు ఉంటాయి.

ఆధార్ కార్డులో కొన్ని సార్లు పేరు, బర్త్ డేట్‌, అడ్రస్ లాంటివి కొన్ని సార్లు తప్పుగా ఉంటాయి. ఇక ఇలాంటి వాటిని మార్చుకోవాలంటే మాత్రం నియమాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. అయితే బర్త్ డేట్ లేదంటే జెండర్‌ విషయంలో ఎలాంటి తప్పు ఉన్నా సరే అలాంటి వాటిని మార్చుకోవడానికి ఆధార్ కూడా ఒకే ఒక్క ఛాన్స్ అందుబాటులో ఉంచింది. కాబట్టి ఆధార్ తీసుకునేటప్పుడు అప్లికేషన్ ఫామ్‌లో పుట్టిన తేదీ, జెండర్ విషయాలు మాత్రం చాలా స్పష్టంగా రాయాల్సి ఉంటుంది. ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రం ఆధార్ కేంద్రంలో మార్పు చేసుకోవచ్చు.

ఒక వేళ ఇక్కడ పని జరగకపోతే 1947 నెంబర్‌కు కాల్ చేయొచ్చు. ఇంకా అవసరం అయితే గనకు help@uidai.gov.in అనే వెబ్ సైట్ ద్వారా మార్పుకోసం లేఖ రాయొచ్చు. ఈ లేఖ ఆధారంగా UIDAI సంస్థ ఏదో ఒక రకమైన నిర్ణయం తీసుకుని పరిష్కారం చెబుతుంది. ఇక ఇంతకుముందు అప్లికేషన్ ఫామ్‌లో తండ్రి లేదంటే భర్తల పేర్లలో తప్పుంటే అది మార్చుకోవడానికి గతంలో S/O లేదంటే W/O అనే ఆప్షన్లు ఉంచారు. కానీ ఇప్పుడు వీటికి బదులుగా C/O అనే కాలమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ ఇలా మార్పు చేసుకోవాలంటే మాత్రం కచ్చితంగా ఆధార్ కేంద్రానికి వెళ్లాలి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •