వార్తలు (News)

తిరుమలలో రూ.20 కోట్ల పనులకు శ్రీకారం చుట్టిన జగన్!!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి అక్టోబర్ మాసం 11 వ తేదీన తిరుమల పర్యటన కు వెళ్లనున్నారు. గరుడ సేవ రోజున స్వామి వారికి పట్టు వస్త్రాలను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున సిఎం జగన్ సమర్పించనున్నారు.

అదే రోజున అలిపిరి వద్ద 13 కోట్ల రూపాయల వ్యయం తో నిర్మించిన గో మందిరం మరియు తిరుమలలో 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అదనపు బూందీ పోటు ను ప్రారంభించనున్నారు. గో మందిరంకు 13 కోట్లు విరాళం మాజీ పాలకమండలి సభ్యుడు శేఖర్ రెడ్డి అందించగా..అదనపు పోటు కు 20 కోట్లు పాలకమండలి సభ్యుడు శ్రీనివాసన్ విరాళం అందించారు. ఇక సిఎం జగన్ తిరుమల పర్యటన నేపథ్యం లో అధికారులు అన్నీ ఏర్పాట్ల కు సిద్దమయ్యారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •