తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో 33,140 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 156 కొత్త కేసులు నమోదవ్వడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,79,720కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఎవరూ చనిపోలేదు. దీంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య స్థిరంగా 4,015 ఉంది. కరోనా బారి నుంచి నిన్న 207 మంది కోలుకోగా ప్రస్తుతం రాష్ట్రంలో ఇంకా 3,642 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.