దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 8,77,055 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 6,563 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 132 మరణాలు సంభవించడంతో ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 4,77,554 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 82,267 క్రియాశీల కేసులు ఉండగా, గత 24 గంటల్లో కోవిడ్ నుండి 8,077 కోలుకున్నారు.