ఏపీలోని పాఠశాలలకు ఈనెల 23 నుంచి క్రిస్మస్, జనవరి 10వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ అకడమిక్‌ క్యాలెండర్‌లో పొందుపరిచింది.

క్రిస్మస్‌ సెలవులను డిసెంబర్‌ 23 నుంచి 30వ తేదీ వరకు నిర్ణయించగా ఈ సెలవులు క్రిస్టియన్‌ మిషనరీ స్కూళ్లకు మాత్రమే వర్తిస్తాయి. డిసెంబర్‌ 31న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. ఇక సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 15వ తేదీ వరకు ఉంటాయని ఎస్‌సీఈఆర్టీ వివరించింది. మిషనరీ పాఠశాలలకు మినహా తక్కిన పాఠశాలలకు ఈ సెలవులు వర్తిస్తాయి. 17వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. జనవరి 8వ తేదీ రెండో శనివారం, 9వ తేదీ ఆదివారం కావడంతో ఆ రెండు రోజులూ కూడా సెలవులే.