నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఫ్యాషన్‌ టెక్నాలజీ వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. మొత్తం 190 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీలు ఉండగా కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగాల భర్తీ జరగనుంది. ఇక వయస్సు 2022 సంవత్సరం జనవరి 31వ తేదీ నాటికి 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు అర్హులు.

సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ పాసైన వాళ్లుఅప్లై చేసుకోవచ్చు. టీచింగ్, పరిశోధన అనుభవం ఉన్నవాళ్లు, ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోచ్చు. రాతపరీక్షలో పాస్ అయితే ప్రజంటేషన్, క్లాస్ రూం లెక్చర్ కు ఎంపిక చేయడం జరుగుతుంది.

ఇందులోనూ పాస్ అయిన వాళ్లకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు రూ.56,100+ నిబంధనల ప్రకారం ఆలవెన్సులు లభిస్తాయి. https://nift.ac.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను చూడచ్చు. రిజిస్ట్రార్‌ కార్యాలయం, హెడ్‌ ఆఫీస్, నిఫ్ట్‌ క్యాంపస్, హజ్‌ఖాస్, న్యూఢిల్లీ-110016 అడ్రస్ కు దరఖాస్తులను పంపించాలి.