మద్యం ప్రియులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్తూ మద్యం పన్ను రేట్లలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ మార్జిన్ లో మార్పులు చేయడంతో ఏపీలో మద్యం ధరలు భారీగా తగ్గనున్నాయి. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ పై 5 నుంచి 12 శాతం వరకు మద్యం ధరలు తగ్గనున్నాయి. మిగతా అన్ని రకాలపై 20 శాతం వరకు తగ్గనున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మద్యం, నాటుసారా అరికట్టడమే లక్ష్యమని, వచ్చే వారం నుంచి అన్ని ప్రముఖ బ్రాండ్ల మద్యం అమ్మాలని నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ సందర్భంగా మద్యం ధర, ఇతర చర్యల వల్ల మద్యం వినియోగం 37 శాతం తగ్గిందని వెల్లడించింది.