దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేడు భారీ నష్టాల్లో ట్రేడింగ్ ను మొదలుపెట్టాయి. ఉదయం 9.32 సమయంలో సెన్సెక్స్‌ 1070 పాయింట్లు నష్టంతో మొదలుపెట్టి 55,940 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 327 పాయింట్ల నష్టంతో 16,657 వద్ద ట్రేడవుతున్నాయి. బీఎస్‌ఈలో ఫ్యూచర్‌ కన్జ్యూమర్‌, ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌, ఫ్యూచర్‌ రిటైల్‌, అపార్‌ ఇండస్ట్రీస్‌, సిప్లా సంస్థల షేర్లు లాభాల్లో ప్రయాణిస్తుండగా.. అరవింద్‌ ఫ్యాషన్స్‌, త్రివేణి ఇంజినీరింగ్‌ ఇండస్ట్రీస్‌, ఉషా మార్టిన్‌, ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌, జిందాల్‌ పోలి ఫిల్మ్స్‌ నష్టాల్లో ఉన్నాయి.