నేడు మార్కెట్లు భారీ నష్టాలను చవి చూశాయి.. ఒమిక్రాన్ కేసులు, లాక్డౌన్ భయాలు, ఫెడ్ నిర్ణయాలు అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్ల పతనానికి దారి తీశాయి. ఉదయం 56,517 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఆద్యంతం అదే తీరు కొనసాగించింది. ఒక దశలో 1800 పాయింట్లకు పైగా నష్టపోయిన సూచీ 55,132 వద్ద కనిష్ఠాన్ని తాకి చివర్లో కోలుకుని 1189.73 పాయింట్ల నష్టంతో 55,822.01 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 371 పాయింట్లు కోల్పోయి 16,614 వద్ద ముగిసింది.
నిఫ్టీలో హిందుస్థాన్ యూనిలీవర్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు మాత్రమే లాభాల్లో ముగిసాయి. అన్ని రంగాల షేర్లూ నష్టపోగా ముఖ్యంగా టాటా స్టీల్, టాటామోటార్స్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, భారత్ పెట్రోలియం నష్టపోయాయి.