ఈ నెల 21వ తేదీన జగనన్న సంపూర్ణ గృహ హక్కు ..!!

0
1

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ లేని ఇళ్లపై యజమానులు పూర్తి హక్కు పొందేందుకు వీలుగా కొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి..

‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ స్కీమ్‌ను తీసుకొచ్చి అది వర్తించే ప్రతిఒక్కరిని నిర్బంధిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ సహా విపక్షాలు అన్నీ ఈ పథకంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.. ఏది ఏమైనప్పటికీ ఈ పథకాన్ని ఈ నెల 21వ తేదీన ప్రారంభించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ (ఓటీఎస్) కింద లబ్ధిదారుల నుంచి ఇప్పటికే రిజిస్ట్రేషన్‌కు డబ్బులను ప్రభుత్వం వసూలు చేసింది.