హైదరాబాద్‌లో 10 సం. తరువాత ఈ రోజు కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ప్రతిరోజు రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో, నగరంలో డిసెంబర్ నెలలో కనిష్ట ఉష్ణోగ్రత శనివారం నమోదు అయ్యింది. పటాన్‌చెరులో శనివారం తెల్లవారుజామున 8.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. గతంలో హైదరాబాద్‌లో డిసెంబర్ 13, 2015న అత్యల్ప ఉష్ణోగ్రత 9.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.

హైదరాబాద్ నగరం యొక్క మొత్తం కనిష్ట ఉష్ణోగ్రత 12.5 డిగ్రీల సెల్సియస్, ఇది సాధారణం కంటే కనీసం రెండు డిగ్రీలు తక్కువగా ఉంది. భారత వాతావరణ శాఖ-హైదరాబాద్ అధికారుల ప్రకారం, ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది. రాబోయే ఐదు రోజులపాటు వాతావరణ సూచన ప్రకారం జాగ్రత్తగా ఉండాలని, పిల్లలు, వృద్దులు జాగ్రత్తగా ఉండాలి అని , హైదరాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత మూడు నుండి నాలుగు డిగ్రీల సెల్సియస్ తగ్గే అవకాశం ఉందని, దీనితో పాటు ఉపరితల గాలులు గంటకు ఆరు నుండి ఎనిమిది కిలోమీటర్ల వరకు ఉంటాయి అని భారత వాతావరణ శాఖ-హైదరాబాద్ అధికారుల తెలిపారు. భారత వాతావరణ శాఖ-హైదరాబాద్ వారు కూడా డిసెంబర్ 21 వరకు నగరంలో ఎల్లో అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేసింది.

తెలంగాణలోని అనేక జిల్లాల్లో శనివారం తెల్లవారుజామున సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి, సంగారెడ్డిలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 6.5 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మహబూబాబాద్ సహా జిల్లాలకు రానున్న కొద్దిరోజులపాటు భారత వాతావరణ శాఖ-హైదరాబాద్ వారు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేస్తూ ప్రజలు అప్రమత్తగా ఉండాలని సూచించింది.