ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ ఈసారి ఐపీఎల్‌లో ఆడడా?

ఈ విషయంలో ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ వ్యాఖ్యలు వింటే ఇదే అనుమానం కలుగుతోంది.  ఐపీఎల్ 2021 వేలంలో స్టీవ్ స్మిత్‌ను కేవలం 2.2 కోట్ల రూపాయలకే ఢిల్లీ జట్టు సొంతం చేసుకుంది. అయితే ఈ డబ్బు కోసం 11వారాలపాటు భార్యకు దూరంగా స్మిత్ ఉంటాడని తాను అనుకోవడం లేదని క్లార్క్ అన్నాడు. 

‘‘భారత్‌కు విమానం బయలుదేరే రోజు హ్యామ్‌స్ట్రింగ్ నొప్పి వచ్చినా ఆశ్చర్యపోకండి’’ అని చెప్పాడు.

కాగా, గత ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు స్టీవ్ స్మిత్ సారధ్యం వహించాడు. ఇతని కెప్టెన్సీలో ఆ జట్టు ఘోరమైన ప్రదర్శన ఇచ్చింది. పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచింది.