వార్తలు (News)

ఉద్వేగానికి లోనైన నరేష్..

ఇన్నాళ్లు తెలుగు ప్రేక్షకులను తన కామెడీ టైమింగ్‌తో అలరించాడు ‘అల్లరి’ నరేష్.. తెలుగులో ‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్ తర్వాత హాస్యనటుడిగా అంతటి పేరు తెచ్చుకున్నారు.. ఇప్పుడు తనలోని నటుణ్ణి బయటకు తీసే విభిన్నమైన పాత్రలతో విలక్షణ నటుడిగా నిరూపించుకోవాలని డిసైడ్ అయ్యి, ఆ ప్రయత్నంలో భాగంగా ‘మహర్షి’ లో రవి గా ఆకట్టుకున్న నరేష్ కొంత గ్యాప్ తర్వాత తనకున్న కామెడీ ఇమేజ్‌ని పక్కన పెట్టేసి ‘నాంది’ అనే ఓ ఢిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు..

‘నాంది’ ప్రోమోలతో ఇదేదో ప్రామిసింగ్ సినిమాలానే ఉంది అనిపించింది ప్రేక్షకులకి. ఈ శుక్రవారం రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ‘సుడిగాడు’ తర్వాత నరేష్‌కి హిట్ అనేది అందని ద్రాక్షగా మిగిలిపోయింది.. ఎట్టకేలకు ‘నాంది’ తన నమ్మకాన్ని నిజం చేసింది. రిలీజ్ రోజు సాయంత్రం సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేయడానికి సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు మూవీ టీం.

ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.. సినిమాలో తన తండ్రి క్యారెక్టర్ చేసిన నటుడు, దర్శకుడు దేవి ప్రసాద్‌ను పట్టుకుని భోరున ఏడ్చేశారు. సక్సెస్‌మీట్‌లో మాట్లాడేప్పుడు కూడా నరేష్ ఎమోషనల్ కాగా నిర్మాత సతీష్ ఓదార్చారు.
‘‘2012 ఆగస్టులో ‘సుడిగాడు’ పెద్ద హిట్ అయ్యింది.. ఆ తర్వాత మళ్ళీ హిట్ రావడానికి ఎనిమిదేళ్లు పట్టింది.

చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. కామెడీ సినిమాలు చేస్తూ.. ఫ్లాపుల్లో ఉన్నాను. అయినా సరే నిర్మాత సతీష్‌ వేగేశ్న నన్ను నమ్మి ప్రోత్సహించారు. ఈ సినిమా ఆడుతుందా లేదా అనే భయం ఉండేది. నా కామెడీ ఇమేజ్‌ సినిమాకు ఎక్కడ ప్రాబ్లమ్ అవుతుందో అనే టెన్షన్‌ ఉండేది. కానీ ప్రేక్షకులు అవేవి పట్టించుకోలేదు. సినిమా బాగుందని చాలా మంది ఫోన్ల్‌ చేసి ప్ర‌శంసిస్తున్నారు.. డైరెక్టర్‌ విజయ్‌ నాకు సెకండ్ బ్రేక్‌ ఇచ్చాడు’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు నరేష్.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.