వార్తలు (News)

‘ఉప్పెన’ సినిమాను కుటుంబంతో క‌లిసి వీక్షించిన బాల‌కృష్ణ‌

కొత్త టాలెంట్‌ను వెన్నుత‌ట్టి ప్రోత్స‌హించ‌డంలో ఎప్పుడూ ముందుండే నంద‌మూరి బాల‌కృష్ణ మ‌రోసారి త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌లైన `ఉప్పెన` సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది.

వైష్ణ‌వ్ తేజ్‌, బుచ్చిబాబు సానా కాంబినేష‌న్‌లో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ సినిమాను చూసిన అంద‌రూ సినిమా బావుంద‌ని ప్ర‌శంసించారు. తాజాగా నంద‌మూరి బాల‌కృష్ణ కూడా కుటుంబంతో క‌లిసి `ఉప్పెన‌` సినిమాను వీక్షించారు. అనంత‌రం సినిమా చాలా బావుంద‌ని ఎంటైర్ టైమ్‌ను అభినందించారు బాల‌కృష్ణ‌. 

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.