అమరావతి: ఏపీ ప్రజలకు సీఎం జగన్ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. మాతృభాష అంటేనే మన ఉనికి, అస్తిత్వమని పేర్కొన్నారు. జీవన విధానానికి మూలాధారం మాతృభాష అని, తెలుగు భాషను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత అని ఆయన అన్నారు.