పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, సీనియర్ కమెడియన్ అలీ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు.

పవన్ ప్రతి సినిమాలోనూ అలీ తప్పక కనిపించేవాడు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పవన్, అలీ మధ్య విభేదాలు తలెత్తాయి.

ఒకరికొకరు దూరమయ్యారు. అయితే తాజాగా వీరిద్దరూ ఓ పెళ్లి వేడుకలో కలిశారు. అలీ బంధువుల పెళ్లి వేడుకకు పవన్ హాజరయ్యారు. ఆ సందర్భంగా వీరిద్దరూ కాసేపు నవ్వుతూ మాట్లాడుకున్నారు. ఆ వీడియోను అలీ భార్య జుబేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.