అంతర్జాతీయం (International) ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle)

మరో మహమ్మారి?… రష్యాలో తొలి కేసు!

ప్రపంచాన్ని ఇప్పుడు మరో మహమ్మారి ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటివరకూ ఎన్నో దేశాల్లో వ్యాపించి, కోట్లాది పక్షులను బలిగొన్న బర్డ్ ఫ్లూ మొట్టమొదటి సారిగా మనుషులకు సోకింది. రష్యాలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకింది. ఈ విషయాన్ని అధికారికంగా నిర్దారించిన రష్యా శాస్త్రవేత్తలు, ఇన్ ఫ్లూయెంజా ఏ వైరస్ లోని హెచ్5ఎన్8 రకం తొలిసారిగా మానవునిలో కనిపించిందని, వెంటనే ఈ విషయాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు తెలియజేశామని పేర్కొంది.

కరోనా వైరస్‌తో ఇప్పటికే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. మరోవైపు బ్రిటన్‌ను కరోనా స్ట్రెయిన్‌ గజగజలాడిస్తోంది. తాజాగా రష్యాలో బయటపడిన ఓ కొత్త రకం వైరస్‌ ఆందోళన కలిగిస్తోంది. రష్యాలోని ఓ పౌల్ట్రీ కోళ్లలో కొత్త రకం H5N8 స్ట్రెయిన్‌ వైరస్ బయటపడింది. పౌల్ట్రీలో పనిచేసే ఏడుగురిలో ఈ కొత్త వైరస్‌ను గుర్తించారు. కోళ్ల నుంచి మనుషులకు వైరస్‌ సోకిన తొలి కేసుగా ఈ ఘటన నిలిచిందని ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారి అన్నాపొపొవా వెల్లడించారు. దీని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారం అందించామని తెలిపారు. కోళ్లను ప్రత్యక్షంగా తాకడం ద్వారా, అపరిశుభ్ర వాతావరణంలో ఉండటం వల్ల ఈ వైరస్‌ వేగంగా వ్యాపిస్తోందని అన్నారు.

ఇది పక్షులకు కూడా సోకే ప్రమాదం ఉందని, వలస పక్షుల కారణంగా వేగంగా వ్యాపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే H5N8 వైరస్‌ మనుషుల్లో అంత ప్రభావం చూపడం లేదని ఆయన పేర్కొన్నారు. ఫ్రెంచ్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌ (సీఎన్‌ఆర్‌ఎస్‌) పరిశోధకుడు ఫ్రాంకోయిస్‌ రెనాడన్‌ మాట్లాడుతూ.. ఈ కొత్త స్ట్రెయిన్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇప్పటికే దీనిపై తాము ప్రయోగాలు మొదలుపెట్టామని తెలిపారు. కరోనా ప్రపంచానికి వేగంగా స్పందించడం నేర్పిందని, కొత్త వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

మరోవైపు రష్యాకు చెందిన వెక్టర్‌ స్టేట్‌ వైరాలజీ అండ్‌ బయో టెక్నాలజీ సెంటర్‌ కరోనా వైరస్‌కు టీకా అభివృద్ది చేస్తున్న విషయం తెలిసిందే. కొత్త బర్డ్‌ ఫ్లూ స్ట్రెయిన్‌కు తాము వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని వెక్టర్‌ చీఫ్‌ రినాట్‌ మక్యుటోప్‌ తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.