వార్తలు (News)

మాస్ మహారాజా.. కొత్త సినిమా…

మాస్ మహారాజా రవితేజ 2021 సంక్రాంతి విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. క్రాక్ సినిమా ఆయన కెరీర్ కు మరో పవర్ఫుల్ బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. రవితేజ పనైపోయింది. ఇక సినిమాలు చేయడం కష్టమే అనే కామెంట్స్ ఎన్నో వస్తున్న తరుణంలో క్రాక్ సినిమాతో దిమ్మితిరిగేలా కౌంటర్ ఇచ్చాడు. మాస్ రాజా చివరగా రాజా ది గ్రేట్ సినిమాతో హిట్ కొట్టిన విషయం తెలిసిందే.

ఇక మళ్ళీ చాలా కాలం తరువాత క్రాక్ ద్వారా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో లాభాలను అందించాడు. ఇక అతను రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచినట్లు సమాచారం. అయితే మాస్ రాజా కేవలం హిట్ లో ఉన్న దర్శకులనే కాకుండా ఫెయిల్యూర్ లో ఉన్న వారితో కూడా వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. ఇక ఫైనల్ గా త్రినాథరావు నక్కిన మాస్ రాజాతో ఒక సినిమా చేయనున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు.

సినిమా చూపిస్త మావ, నేను లోకల్ వంటి సినిమాలతో బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న త్రినాథరావు నక్కిన చివరగా రామ్ పోతినేనితో హలో గురు ప్రేమకోసమే.. అనే సినిమా చేశాడు. కానీ ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో హిట్టవ్వలేదు. ఇక నెక్స్ట్ మాస్ రాజా 68వ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద హిట్ అందుకోవాలని ఈ దర్శకుడు ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం మాస్ రాజా రవితేజ ఖిలాడి సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

క్రాక్ సినిమాకు సహాయక దర్శకుడిగా పని చేసిన గులాబీ శ్రీనుతో కూడా రవితేజ ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. గోపీచంద్ మలినేనితో గత సినిమాల నుంచి ట్రావెల్ చేస్తూ వస్తున్న శ్రీను ఇటీవల రవితేజను మరో మాస్ కథతో మెప్పించిన్నట్లు సమాచారం. క్రాక్ సినిమా పక్కా మాస్ కమర్షియల్ కావడంతో మళ్ళీ అంతకంటే హై రేంజ్ లో ఉండాలని కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు మాస్ రాజా.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.