ఇంగ్లండ్‌తో జరగబోతున్న టీ20 సిరీస్‌కు ముంబై బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ ఎంపికైన విషయం తెలిసిందే.

చాలా రోజుల నిరీక్షణ తరువాత స్కైకు జాతీయ జట్టులో స్థానం లభించింది. ఈ టైంలో సెలక్షన్ కమిటీ ఇంతకుముందు స్కై గురించి చేసిన కామెంట్ వైరల్ అవుతోంది.

అప్పట్లో ఆసీస్ సిరీస్ సిరీస్‌కు స్కైను ఎంపిక చేయకపోవడంపై అప్పట్లో సెలక్షన్ కమిటీపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. సూర్యకుమార్ యాదవ్ కూడా ఆసీస్ సిరీస్‌కు తాను ఎంపికవుతానని అనుకున్నట్లు చెప్పాడు.

దీంతో సెలక్షన్ కమిటీపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో సెలక్షన్ కమిటీ సభ్యుడు అబే కురువిల్లా ఫేస్‌బుక్‌లో ఓ కామెంట్ చేశారు. ‘స్కై కా టైం ఆయేగా(స్కై టైం వస్తుంది)’ అని కామెంట్ చేశారు.