వార్తలు (News)

సెల్ఫీ తీసుకుంటూ బావిలో పడ్డ యువతి

భోపాల్‌: సెల్ఫీ సరదా శృతిమించి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు ఎన్నో వింటూనే ఉన్నాం. తాజాగా మధ్యప్రదేశ్‌లోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. బావి మీద నిలబడి సెల్ఫీ తీసుకుందామనుకున్న ఓ యువతి ఆ బావిలో పడిపోయింది.

మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లా సుఖేడా గ్రామానికి చెందిన ఓ యువతి బావి వద్ద సెల్ఫీ తీసుకోవాలని భావించింది. ఇందుకోసం బావి చివరిలో నిలబడింది. ఈ క్రమంలోనే  అదుపుతప్పి ఆ బావిలో పడిపోయింది.

నూతిలో పడ్డ యువతి అరుపులు విని ఆ దారిన వెళుతున్న ఓ యువకుడు అందులోకి దిగాడు. ఆమెను రక్షించిన అనంతరం పైకి ఎలా రావాలో అతడికి కూడా అర్థం కాలేదు. దీంతో ఇద్దరు కలిసి నూతిలో నుంచి కాపాడండి అంటూ అరవసాగారు.

వారి అరుపులు విన్న గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. గ్రామస్థుల సాయంతో అతి కష్టం మీద వారిరువురిని తాళ్లతో బయటకు లాగి కాపాడారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.