క్షణికావేశంలో ఒక కోడలు అత్తను రాడ్ తో కొట్టి చంపి పక్కింటి బాత్రూం లోకి దూరి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ సంఘటన మహారాష్ట్రలో రాయఘడ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాయగడ్ కి చెందిన యోగితా భర్త రెండు సంవత్సరాల క్రితం మరణించారు. అప్పటి నుండి కూడా ఆవిడ తన ఇద్దరు పిల్లలతో కలిసి అత్తారింట్లోనే ఉంటోంది. తరచుగా అత్తా కోడళ్ళు ఇద్దరు గొడవలు పడుతూ ఉండేవారు. అలాగే శుక్రవారం కూడా ఇద్దరికీ గొడవ జరిగింది. ఆ సమయంలో తీవ్ర ఆగ్రహానికి గురయిన యోగితా, అత్త తార భాయ్ ని తన ఇద్దరు పిల్లల కళ్ళ ముందే ఇనుప రాడ్ తో కొట్టి చంపింది.
విషయం తెలిసిన పోలీస్లు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీస్ లు అరెస్ట్ చేస్తారనే భయం తో యోగితా పక్కింటి బాత్రూంలోకి దూరి తలుపులు వేసుకుని, టాయిలెట్ క్లీనర్ తాగి ఆత్మహత్య కు ప్రయత్నించింది. పోలీస్ లు బాత్రూం తలుపులు బద్దలుగొట్టి చూడగా అపస్మారక స్థితి లో కనిపించింది. దీనితో ఆమెను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. నిందితురాలు ఆస్పత్రి నుండి విడుదలైన వెంటనే అరెస్ట్ చేస్తామని పోలీస్ లు అంటున్నారు.