యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఫ్లైట్-328 బోయింగ్ 777 విమానం 231 మంది ప్రయాణికులు , 10 మంది సిబ్బంది తో డెన్వర్ ఎయిర్ పోర్ట్ నుండి టేక్ ఆఫ్ తీసుకోగానే ఈ ప్రమాదం జరిగింది.విమానం కుడివైపు ఇంజిన్ చెడిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ ఏ ఏ) తెలిపింది.
ఈ ప్రమాదంలో ఎవరు గాయపడలేదని అధికార వర్గాల సమాచారం.టేకాఫ్ తీసుకున్న కాసేపటికే విమానంలో పేలుడు శబ్దం వినపడిందని, విమానం భయంకరంగా ఊగిందని, అది పైకి వెళ్లడం కాకుండా కిందకి పడిపోవడం మొదలయింది అని ప్రయాణికులు చెప్పారు.