అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime)

కరోనా వ్యాక్సిన్ కోసం వృద్దులుగా మారిన మహిళలు

కరోనా మహమ్మారి ఎలా విస్తరిస్తోందో చెప్పక్కర్లేదు.  కరోనా రూపాంతరం చెంది మరింత బలపడి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నది.  ఇప్పటికే వైరస్ ధాటికి లక్షలాది మంది మృత్యువాత పడ్డారు. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. 

లక్షలాది మంది వ్యాక్సిన్ తీసుకుంటున్నారు.  అయితే, ప్రస్తుతం పెద్ద వయసు కలిగిన వ్యక్తులకు వ్యాక్సిన్ అందిస్తున్నారు.  అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో వ్యాక్సిన్ వేయించుకోవడానికి 33, 43 సంవత్సరాల వయసు కలిగిన ఇద్దరు మహీళలు వృద్ధ మహిళలుగా వేషం మార్చుకొని టీకా వేయించుకోవడానికి వచ్చారు.  వారివద్ద వ్యాక్సినేషన్ కు సంబంధించిన కార్డులు ఉన్నప్పటికీ వారి డ్రైవింగ్ లైసెన్స్ వివరాల ప్రకారం వయసు తేడా కనిపించడంతో అధికారులు నిలదీశారు.  దీంతో అసలు విషయం బయటపడింది.  అయితే, అప్పటికే వారు మొదటిడోసు తీసుకొని ఉండటంతో అధికారులు రెండో డోస్ వేయించి మందలించి పంపించేశారు.  

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.