నాల్గొదశ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు సిద్ధమని పంచాయతీ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. 13 జిల్లాల్లోని 16 రెవెన్యూ డివిజన్లు, 161 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 28,995 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 6,047 సమస్యాత్మక, 4,967 అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా వర్గీకరించారు.
కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాటు చేసారు. సెంటర్ల దగ్గర వీడియోలో రికార్డు అయ్యేలా మార్పు చేసారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఆదివారం నాలుగో విడత పోలింగ్‌ జరగనుంది. ఇందుకు పంచాయతీ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేసి తుది దశ కూడా ప్రశాంతంగా నిర్వహిస్తామని పోలీస్‌ అధికారులు ధీమాగా ఉన్నారు.