రాజకీయం (Politics)

త్వరలో జగన్, కేసీఆర్ భేటీ.. షర్మిల పార్టీ సంగతేంటి ?

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయి చాలా రోజులు అయ్యింది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఇరు రాష్ట్రాల సీఎంలు పలుసార్లు సమావేశాలు అయ్యారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అనేక అంశాలపై చర్చించారు. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయినది లేదు. అయితే ఈ క్రమంలో వీరిద్దరు మరోసారి సమావేశం కానున్ననట్లు సమాచారం. కేసీఆర్ , జగన్ త్వరలో మీట్ అయ్యే అవకాశాలున్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. 

వీళ్లిద్దరు త్వరలోనే కీలక సమావేశం నిర్వహించి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని అంశాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ బడ్జెట్‌లో ఇరు రాష్ట్రాలకు ఒరిగిందేమి లేదు. అటు ఏపీతో పాటు.. ఇటు తెలంగాణకు కూడా కేటాయింపుల్లో అన్యాయం జరిగింది. దీంతో కేంద్రం రెండు రాష్ట్రాలకు అన్యాయం చేస్తుందన్న ఆగ్రహం అటు ప్రజలతో పాటు ఇటు ప్రభుత్వాల్లో కూడా నెలకొంది. ఈ నేపథ్యంలోనే కేంద్రంతో ఎలా వ్యవహారించాలన్న దానిపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. 

కేంద్రాన్ని నిలదీసే విషయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఘోరంగా విఫలమవుతున్నారు అనే భావన రాజకీయవర్గాల్లో ఉంది. అటు ప్రతిపక్షాలు కూడా ఇదే విషయాన్ని విమర్శల రూపంలో పదునెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే వీరిద్దరూ సమావేశమై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి అడగాలి అని భావిస్తున్నారు. వాస్తవానికి వీళ్లిద్దరికి కేంద్ర ప్రభుత్వం అవసరం ఉన్నా సరే ఇప్పుడు రాష్ట్రంలో అప్పులు పెరిగిపోతున్నాయి కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేంద్రం మీద ఆధారపడాల్సిన అవసరం ఉందని అంటున్నారు. రెండు రాష్ట్రాలు ఇటీవల కాలంలో అప్పుల బాధతో అల్లాడుతున్నాయన్న విషయం తెలిసిందే. 

ఏపీలో కూడా అప్పులు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ కేంద్ర ప్రభుత్వంను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఇద్దరూ సీఎంలు కలిసి ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అని తెలుస్తుంది. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పదేపదే అన్యాయం చేస్తుందని జగన్, కేసీఆర్ కూడా భావిస్తున్నారు. వీరిద్దరూ సమావేశం అయితే ఎలాంటి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తారు అనేదానిపై రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. . మరోవైపు బీజీపీ దూకుడుకు కూడా రెండు రాష్ట్రాల్లో చెక్ పెట్టేందుకు సీఎంలు కూడా ప్రయత్నం చేస్తున్నారు. 

మరోవైపు జగన్, కేసీఆర్ భేటీలో కేంద్ర వైఖరితో పాటు… షర్మిల కొత్త పార్టీ అంశం ప్రస్తావనకు వస్తుందా? రాదా ?అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడతారన్న సమాచారం జోరందుకుంది. ఈ క్రమంలో ఆమె అధికార పార్టీనే టార్గెట్ చేసిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో రాజన్న రాజ్యం లేదని ఆమె ముందుగానే చెప్పారు. దీంతో జగన్ సోదరి అయిన షర్మిల వ్యవహారంలో కూడా వీరిద్దరూ చర్చిస్తారా అనే అంశం ప్రస్తుతానికి హాట్ టాపిక్‌గా మారింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.