సూర్యారావుపేట సర్పంచ్ అభ్యర్థి లెక్కింపులో, తప్పు జరిగిందని! తిరిగి లెక్కింపు జరుపమని కోరుతున్న కాలా సుప్రియ!

తూర్పు గోదావరి జిల్లా, ఆలమూరు మండలంలోని, సూర్యారావు పేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన కాలా సుప్రియ తనకు అన్యాయం జరిగిందని, సర్పంచ్ అభ్యర్థుల లెక్కింపులో మోసపూరిత లెక్కింపు కారణంగా, తనకు చెందవలసిన ఓట్లు, వేరే అభ్యర్థి ఖాతాలో వేసి లెక్కించడం మూలంగా, తనకు అన్యాయం జరిగిందని, సర్పంచ్ అభ్యర్థిగా గెలవాల్సిన తనకు, 12 ఓట్ల తేడాతో ఓటమి చవి చూడవలసి వచ్చిందని, ఇది కేవలం మోసపూరిత లెక్కింపు కారణంగా, అధికార పార్టీ వారి అండదండలతో, సర్పంచ్ అభ్యర్థి లెక్కింపులో ఆలమూరు మండలం, సూర్యారావు పేట గ్రామానికి ఎన్నికలు నిర్వహించిన అధికారులు, తనను మోసం చేశారని, తనకు న్యాయం చేయమని ఆలమూరు మండల ఎన్నికల అధికారిని, మరియు ఆలమూరు మండల ఎంపీడీవో అధికారిని ఝాన్సీకు, ఈరోజు 20-2- 2021న కంప్లైంట్ చేయడం జరిగిందని, సర్పంచ్ అభ్యర్థి ఎన్నిక 13-2-21న లెక్కింపు రోజున, తనకు లెక్కింపులో అన్యాయం జరుగుతుందని గొడవ చేసినా కూడా, ఏ ఎన్నికల అధికారులు పట్టించుకోలేదని, ముఖ్యంగా ఆరోజు ఎన్నికల అధికారిగా ఉన్న పి వో కూడా పట్టించుకోకుండా, అధికార పార్టీ వారికి వత్తాసు పలికి ఉన్నారని, ఇలాంటి అన్యాయం జరగకుండా మరొక్కసారి ఎన్నికల లెక్కింపును సూర్యారావుపేట గ్రామానికి జరిపించాలని ఉన్నతాధికారులను కోరుతూ, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ వారికి, మరియు సబ్ కలెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అని, అదేవిధంగా కోర్టుకు కూడా వెళ్లి న్యాయం జరిగే వరకు పోరాడతామని, సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన క్యాండెట్, కాలా సుప్రియ, మరియు కాలా జయరాజ్, వనుం సూరిబాబు తెలియజేసి యున్నారు.