బెర్లిన్‌:  క‌రోనా వేళ మాస్క్ ధ‌రించ‌డం ఎంత కీల‌క‌మో అంద‌రికీ తెలిసిందే.  మాస్క్‌ను త‌ప్ప‌నిస‌రి చేస్తూ అన్ని ప్ర‌భుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.  క‌రోనా వైర‌స్‌ను నియంత్రించేందుకు ఇదో ఉత్త‌మ‌మైన నిబంధన‌. అయితే జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్ ఏంజిలా మెర్క‌ల్‌..  మాస్క్‌ను పెట్టుకోవ‌డం మ‌రిచిపోయారు. దాంతో ఆమె కొంత గంద‌ర‌గోళానికి లోన‌య్యారు. 

పార్ల‌మెంట్‌లో బ‌డ్జెట్ ప్ర‌సంగం చేసిన త‌ర్వాత‌.. మెర్క‌ల్ మైక్ టేబుల్‌పై మాస్క్‌ను మ‌రిచిపోయారు. బ‌డ్జెట్ బుక్‌తో వెళ్లి త‌న టేబుల్‌పై కూర్చున్న మెర్క‌ల్ కు.. మాస్క్ పెట్టుకోలేద‌ని గుర్తొచ్చింది.  దాంతో ఆమె హైరానా ప‌డ్డారు.  త‌న టేబుల్‌పై మాస్క్ ఎక్క‌డుందో వెతికారు. కానీ మాస్క్ క‌నిపించ‌క‌పోవ‌డంతో.. మైక్ టేబుల్ ద‌గ్గ‌ర‌కు పరుగెత్తి  మ‌రీ మాస్క్ తెచ్చుకున్నారు. 

చిరు న‌వ్వు న‌వ్వుతూ మాస్క్ పెట్టుకుని త‌న కుర్చీలో కూర్చున్నారామె.  ఆ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ఇదే. క‌రోనా వేళ ఆ నేత‌ను మ‌నమంద‌రం ఆద‌ర్శంగా తీసుకుందాం. ఫేస్ మాస్క్‌ను ధ‌రించ‌డం మ‌రిచిపోవ‌ద్దు.