వార్తలు (News)

పంచాయతీలకు కొత్త రూల్స్.. ఏ ఒక్కటి అతిక్రమించినా పదవి పోతుంది జాగ్రత్త!

పంచాయతీ ఎన్నికలు ముగింపు దశకు చేరుకోవడంతో ఏపీ ప్రభుత్వం కొత్త నియమ నిబంధనలను విడుదల చేసింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే ఈ మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. పంచాయతీ నిర్వహించాల్సిన విధి విధానాలను ఇందులో పేర్కొన్నారు. తాజా మార్గదర్శకాల ప్రకారం పంచాయతీకి సంబంధించిన ఆదాయ, వ్యయాలను తప్పనిసరిగా నోటీసు బోర్డులో పేర్కొవాలి. ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా నోటీసు బోర్డులో పెట్టాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రతి నెల గ్రామసభ తప్పక నిర్వహించాలి.

 నీటి/ ఇంటి పన్నులు వసూలైనవి, వచ్చినవి ప్రతి నెల నోటీసు బోర్డుపై చూపాలి.

 ప్రతి నెల వీధి దీపాలు పరిశీలించి, పనిచేయని వాటి స్థానంలో కొత్తవి వేసి, ఎన్ని వేశారో నోటీసు బోర్డుపై చూపాలి.

 ప్రతి నెల కొత్త పింఛన్లు ఎవరికీ జారీచేయాలో పరిశీలించి ఇప్పించాలి.

 నెలలో ఒకసారి మరుగుదొడ్లను వాడకం, చెత్త సేకరణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి..

 ఏదైన పండుగలకు చేసిన ఖర్చులు నోటీసు బోర్డులో చూపించాలి.

 గవర్నమెంట్ నిధులు ఎంత వచ్చాయో,ఎంత ఖర్చు చేశారో నోటీసు బొర్ఢులో చూపాలి.

 ప్రతి నెల గ్రామసభ నిర్వహించి, అందులో 100 మందికి పైగా ఉన్న ఫొటో సంబంధిత అధికారికి పంపాలి. గ్రామంలోని ప్రజల అవసరాలను తెలుసుకుని వాటిని నిర్వచించాలి.

⍟ ప్రతి ఇంటికి మరుగు దొడ్డి లేకపోతే కట్టించాలి. ఇంతక ముందు కట్టిన వారికి డబ్బులు రాకపోతే ఇప్పించాలి..

 గ్రామం, ప్రతి ఇంటికి ఆవరణలో రెండు చెట్లను నాటించాలి.

 రేషన్ షాప్‌లో బియ్యం ఎన్ని వస్తున్నాయి, ఎన్ని పోతున్నాయి తెలుసుకోవాలి. బయటి సరుకులు రేషన్ షాప్‌లో ఆమ్మరాదు.

 గ్రామంలో ప్రతి మనిషికి కి రూ.132.00 రూ ప్రభుత్వం ఇస్తుంది. ఉదాహరణకు గ్రామంలో 6000 మంది ఉంటే రూ.8 లక్షల గ్రామపంచాయతీలకు ఇస్తుంది. ప్రతి నెల గ్రామ పంచాయతీ ఈ రూ.8 లక్షల దేనికి ఉపయోగిస్తున్నారో గ్రామసభలో అడగవచ్చు.

ఈ పదకొండు పాయింట్లలో ఏదైనా లోపం జరిగినా ఆ పదవి నుంచి తొలిగించే అధికారం ప్రజలకు ఉంది. ఇక చివరి పాయింట్ చాలా ముఖ్యమైంది. ప్రభుత్వం నుంచి వచ్చిన నగదు ఎంత? పంచాయితీ అభివృద్ధి కార్యక్రమాలకు పెట్టిన ఖర్చు ఎంత? అనేది ప్రతి ఒక్కళ్లూ తెలుసుకోవాలి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.