దేశంలోని దక్షిణ ప్రాంతంలో గల ఒక పౌల్ట్రీ ప్లాంట్‌లో గత డిసెంబర్‌లో బర్డ్ ఫ్లూ వ్యాపించిందని, అందులో పని చేసే ఏడుగురు కార్మికులకు ఈ బర్డ్ ఫ్లూ సోకినట్టుగా అధికారులు చెప్పారు. ఏడుగురు ఇప్పుడు ఆరోగ్యం గానే ఉన్నారని రష్యా వినియోగదారుల ఆరోగ్య పర్యవేక్షణ సంస్థ అధినేత అన్న పోపోవా తెలిపారు.
బర్డ్ ఫ్లూ వైరస్ మనుషులకు సోకిన తోలి కేసు ఇదే! రష్యా దీనిని గుర్తించింది. ఈ వైరస్ వ్యాపించకుండా నిరోధించడానికి వేగంగా తగిన చర్యలు చేపట్టారు. ఈ వ్యాధి మనుషుల నుండి మనుషులకు వ్యాపిస్తున్నట్టుగా సంకేతాలు లేవు అన్నారు. ఈ విషయాని ప్రపంచ ఆరోగ్య సంస్థకు నివేదించినట్టుగా చెప్పారు.
రష్యా కు చెందిన వెక్టార్ లేబరేటరీ బర్డ్ ఫ్లూ సోకిన కార్మికుల నుండి సేకరించిన వైరస్ ని వేరు చేసి దానిపై జన్యు పదార్ధాన్ని వేరు చేసిందని, దీనిని ఒక శాస్త్రీయ ఆవిష్కరణ గా వర్ణించారు.
ఈ వైరస్ మనుషుల నుండి మనుషులకి సంక్రమించే సామర్ధ్యం ఇంకా సంతరించుకోలేదు, ఈ మ్యుటేషన్ గుర్తించడానికి, ముందు రాగల మ్యుటేషన్ ను ఎదుర్కోవడానికి, స్పందించడానికి తగిన సమయాన్ని ఇస్తుంది అని వివరించారు. ఈ వైరస్ సోకితే గుర్తించడానికి అవసరమైన పరీక్షా వ్యవస్థలను తయారు చేయడం ఫై రష్యా శాస్త్రవేత్తలు కృషి చేయడానికి సిద్ధముగా ఉన్నారు