హైదరాబాద్‌: తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపించడమే లక్ష్యమని వైఎస్‌ షర్మిల పునరుద్ఘాటించారు. వైఎస్సార్‌ కులమతాలకు అతీతంగా పాలించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో శనివారం రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్‌ పరిధిలోని వైఎస్‌ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న షర్మిల…

జై తెలంగాణ, జోహార్‌ వైఎస్సార్‌ అంటూ నినదించారు. పేదలు, విద్యార్థులు, రైతులకు ఉపయోగపడేలా వైఎస్సార్‌ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తీర్చిదిద్దారన్న షర్మిల.. ప్రజల ఆశీర్వాదంతో నాటి స్వర్ణయుగాన్ని మళ్లీ తెచ్చుకుందామని అభిమానులకు పిలుపునిచ్చారు. పలు అంశాలపై అభిమానుల అభిప్రాయాలు సేకరించేందుకు ప్రశ్నలు ఇచ్చి సమాధానాలు కోరారు.