వార్తలు (News)

ఏపీలో 2వేలు దాటిన యాక్టివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 31,138 నమూనాలను పరీక్షించగా
368 మందికి కరోనా సోకడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,93,734కి చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 7189 మంది బాధితులు మృతి చెందారు.

ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 263 మంది పూర్తిగా కోలుకోవడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,84,357కి చేరింది. కోలుకున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల్లో పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 2188 యాక్టివ్ కేసులున్నాయి.

ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,47,36,326 కరోనా నమూనాలను పరీక్షించగా అనంతపురంలో 40, చిత్తూరులో 40, తూర్పుగోదావరిలో 20, గుంటూరులో 79, కడపలో 10, కృష్ణాలో 37, కర్నూలులో 49, నెల్లూరులో 20, ప్రకాశంలో 6, శ్రీకాకుళంలో 10, విశాఖపట్నంలో 39, విజయనగరంలో 9, పశ్చిమగోదావరిలో 9 కరోనా కేసులు నమోదయ్యాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.