శంషాబాద్‌ పరిధిలోని పాలమాకులలోని గురుకుల పాఠశాలలో 44 విద్యార్థినులకి కరోనా సోకింది. మూడు రోజుల క్రితం కొంత మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో ఆ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు మొత్తం 900 బాలికలు ఉండగా వారిలో దాదాపు 500 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో మూడు రోజుల కిందట 23 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, ఇవాళ మరో 21 మందికి కరోనా సోకినట్లు వైద్యులు వెల్లడించారు. మరికొంత మంది ఫలితాలు రావాల్సి ఉందని, పాఠశాలలో మిగిలిన 400 మంది విద్యార్థులకు కూడా కొవిడ్ పరీక్షలు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గురుకుల విద్యాలయ ప్రధానోపాధ్యాయురాలు శివగీత తెలిపారు.