రాయికల్‌ మండలంలోని భూపతిపూర్‌ గ్రామానికి చెందిన యాచమనేని గంగారావు (85), కోరుట్లకు చెందిన పైడిపల్లి భాగ్యలక్ష్మి (80) అన్నా చెల్లెలు. అయితే శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు అనారోగ్యంతో పైడిపల్లి భాగ్యలక్ష్మి మృతి చెందారు. తన చెల్లెలు లేని జీవితం నాకెందుకు అనుకున్నారో ఏమో తెలియదు కానీ అదే రోజు రాత్రి 9 గంటలకు అనారోగ్యంపాలయి గంగారావు కూడా మృతి చెందారు. శనివారం ఒకేసారి ఇద్దరి అంత్యక్రియలు నిర్వహించారు. ఇద్దరు ఒకేసారి మరణించడంతో వారి కుటుంబాల్లోని వారే కాకుండా ఊరు మొత్తం విషాదఛాయలు అలముకున్నాయి.