మృత్యువు ముంచుకొచ్చినప్పుడు ఎవరు తప్పించుకోలేరని మనం తరచుగా వింటూ ఉంటాము. అలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి కూడా! ఇప్పుడు ఏమి జరిగిందంటే… నందిగామ పాత కాకతీయ రెస్టారెంట్ వద్ద జాతీయ రహదారిపై లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడుతున్న సమయంలో లారీ నుంచి డ్రైవరు, క్లీనరు కిందకు దూకేశారు. ఆ తర్వాత ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తు డ్రైవర్ నిలబడి ఉండగా బోల్తాపడిన లారీని డీసీఎం కంటెయినర్ ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ విషాదకర ఈ ఘటన కృష్ణాజిల్లా నందిగామ వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఇదే ప్రమాదంలో మరో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రెండు వాహనాల మధ్యలో లారీ డ్రైవర్ నలిగిపోయాడు. వాటి మధ్యలో చిక్కుకున్న మృతదేహాన్ని బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. జాతీయ రహదారి విస్తరణ పనులు జరగకపోవడం, రహదారిపై భారీగా మట్టి కుప్పలు పేరుకుపోవడమే ప్రమాదాలకు కారణమవుతున్నాయి. లారీ బోల్తాపడిన విషయాన్ని డీసీఎం కంటెయినర్ డ్రైవర్ గమనించకపోవడంతో ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు . కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.