కర్ణాటకలోని ఉడిపిలో కుక్కను వెంటాడుతూ చిరుత పులి ఓ ఇంట్లోకి ప్రవేశించింది. ఆదివారం తెల్లవారుజామున ఓ చిరుత పులి, కుక్కను వెంటాడుతూ బ్రహ్మవర్‌ తాలూకాలోని నైలాడి గ్రామంలోని ఓ ఇంట్లోకి ప్రవేశించింది. అనంతరం ఓ గదిలోకి వెళ్లి అక్కడే ఉండిపోయింది. వేరే గదుల్లో నిద్రపోతున్న ఆ ఇంటి వారు చిరుత ఉన్న గది నుంచి శబ్ధాలు రావటంతో అక్కడకు వెళ్లి చూడగా చిరుత పులి కనిపించింది. దీంతో వెంటనే గది తలుపు మూసేసి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. బోనుతో అక్కడికి చేరుకున్న అధికారులు ఓ గంట పాటు శ్రమించి చిరుతను బంధించారు. అనంతరం దాన్ని దగ్గరలోని అడవిలో వదిలేశారు.