భారత్‌లో కొత్తగా నమోదవుతున్న కేసులతో పాటు ఆక్టివ్ కేసులు, మరణాల సంఖ్యలోనూ పెరుగుదల కొనసాగుతుండటం మిక్కిలి ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 11.33లక్షల పరీక్షలు చేస్తే, 43,846 మందికి కరోనా సోకడంతో మొత్తం కేసుల సంఖ్య 1,15,99,130కి చేరింది. కొత్తగా 22,956 మంది వైరస్ బారి నుంచి బయటపడడంతో మొత్తం రికవరీల సంఖ్య 1,11,30,288కు చేరి.. రికవరీ రేటు 96.12శాతానికి తగ్గింది. ఇక కరోనా మరణాలు శనివారం 197 మంది మరణించడంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,59,755కి చేరింది. ఆక్టివ్ కాసేలా సంఖ్య 3,09,087 కి చేరుకున్నాయి. ఇక మహారాష్ట్రను కరోనా విణికిస్తోంది. నిన్న ఒక్కరోజు అక్కడ 27వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 25.40లక్షల మందికి టీకా వేయడంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం టీకా అందిన వారి సంఖ్య 4,46,03,841కి చేరింది.