రాజకీయం (Politics)

రైల్లో పొగతాగితే జరిమానాతోపాటు జైలు కూడా!

ఈమధ్య తరచూ రైలులో అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిలో చాలా ప్రమాదాలకు కారణం సిగరెట్ లేదా బీడీ అని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన రైల్వే శాఖ.. రైళ్లలో ధుమపానం చేసే వ్యక్తులకు భారీ జరిమానా విధించడానికి, ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లిన సందర్భాల్లో అరెస్టులు సైతం చేయదానికి సిద్ధమవుతోంది. మార్చి 13న న్యూఢిల్లీ-డెహ్రాడూన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు‌ ఎస్‌5 బోగీ టాయిలెట్‌లోని డస్ట్‌బిన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు పొగతాగిన తర్వాత సిగరెట్‌/ బీడీ వేశారని గుర్తించారు. దీంతో అందులోని టిష్యూ పేపర్లకు నిప్పంటుకుని మంటలు చెలరేగినట్లు విచారణ జరిపిన అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో పొగరాయుళ్లకు భారీ జరిమానా విధించే విషయం గురించి సమాలోచనలు చేస్తున్నామని ఓ సీనియర్ రైల్వే అధికారి వెల్లడించారు. ప్రస్తుతం రైళ్లలో పొగతాగితే రైల్వేల చట్టంలోని 167 సెక్షన్ కింద రూ.100 వరకు జరిమానా విధిస్తున్నారు. మరో అధికార మాట్లాడుతూ.. శతాబ్ది ప్రమాదం విషయంలో సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. మంటల వల్ల మరుగుదొడ్డి లోపలి భాగం పూర్తిగా కాలిపోయి పగిలిందని ఆ అధికారి తెలిపారు. మంటలు ప్రారంభమైన తర్వాత కోచ్‌లోని స్మోక్ డిటెక్టర్ ఆగిపోయిందని నలుగురు సభ్యుల దర్యాప్తు బృందానికి ఒక ప్రయాణీకుడు లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందించాడని అధికారులు పేర్కొన్నారు. ఇక రైళ్లలో పొగతాగితే రైల్వేల చట్టంలోని 167 సెక్షన్ కింద రూ.100 వరకు జరిమానా విధిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.