విశాఖలోని మాకవరపాలెం పి.పి అగ్రహారం వద్ద ద్విచక్రవాహనం చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఘటనా స్థలంలో హేమంత్‌(15) మృతి చెందగా ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో అనీశ్‌, హర్షిత్‌ మృతి చెందారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.