క్రైమ్ (Crime) వార్తలు (News)

తూర్పు గోనగూడెంలో ముగ్గురు రైతులపై 100మంది దాడి!

రాజానగరం మండలం తూర్పు గోనగూడెం గ్రామంలో ముగ్గురు రైతులపై సుమారు 100 మంది గుర్తు తెలియని వ్యక్తులు కర్రలు, రాడ్లతో దాడి చేసారు. పొలంలో వ్యవసాయ పనిలో నిమగ్నమైన రైతులు గల్లా గణపతి, గల్లా నాని, గల్లా బాబ్జిపై దుండగులు ఒక్కసారిగా దాడి చేసి గాయపరచడంతో తీవ్ర గాయాలపాలైన ముగ్గురు వ్యక్తులనూ 108 వాహనంలో రాజమహేంద్రవరంలోని ఒక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్తి తగాదాలే ఈ దాడికి కారణంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •