వార్తలు (News)

సూర్యాపేటలో దాసరి ట్రావెల్స్ బస్సు బోల్తా!!

సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని జాతీయ రహదారి 65 ముకుందాపురం వద్ద ట్రావెల్ బస్సు బోల్తాపడి 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళుతుండగా ముకుందాపురంలో ఒక లారీ ఓవర్‌టేక్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులందరూ స్వల్ప గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన అనంతరం మరో బస్సులో ప్రయాణికులను గమ్య స్థానానికి చేర్చారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •