రాజకీయం (Politics) వార్తలు (News)

జూలై 20 నుండి ఉచిత బియ్యం పంపిణీ!!

ఏపీలో జూలై 20,2021 నుండి ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై) కింద కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న బియ్యం పంపిణీ ప్రారంభం కానుంది. కానీ కేంద్రం ఇచ్చే ఈ బియ్యం పంపిణీ ఇంటింటికీ రేషన్ వాహనాల ద్వారా కాకుండా రేషన్ దుకాణాల్లో డీలర్ల ద్వారా చేపట్టాలని పౌరసరఫరాల శాఖ ఆదేశాలివ్వడంతో బియ్యం, అన్నపూర్ణ, అంతోద్యయ కార్డుదారులందరికీ ప్రతి మనిషికి 5కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నారు.

ఇప్పటికే రెగ్యులర్‌ పీడీఎస్‌ కింద రేషన్‌ సరుకులు పంపిణీ చేయగా, కరోనా నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన ఉచిత బియ్యాన్ని ఇప్పుడు పంపిణీ చేయబోతున్నారు. అయితే ఈసారి ఉచితంగా ఇచ్చే బియ్యం పీఎంజీకేఏవై కింద కేంద్రం ఇస్తుందన్న విషయాన్ని రేషన్‌ షాపుల్లో ప్రత్యేకంగా పోస్టర్లు కట్టి ప్రచారం చేకుంటున్నారు. కేంద్రం ఉచితంగా ఇచ్చే బియ్యం మొత్తం 1.47 కోట్ల కార్డుల్లో కేవలం 88 లక్షల కార్డులకే వస్తాయని, మిగిలిన 59 లక్షల కార్డులకిచ్చే బియ్యం భారం మొత్తాన్ని తామే భరిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం వివరించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •