వార్తలు (News)

రాజుకోడూరులో వివాహం .. 40 మందికి కరోనా!!

విశాఖ జిల్లా రాంబిల్లి మండలం రాజుకోడూరులో ఒక వివాహ కార్యక్రమానికి హాజరైన 40 మందికి కరోనా సోకింది. విశాఖ జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని అందరూ భావించి సామాజిక దూరాన్ని, మాస్కులను గాలికొదిలేశారు. ముఖ్యంగా శుభకార్యాలకు వెళ్ళేవారి సంఖ్య పెరుగుతుండడమేకాక శుభకార్యాల్లో మాస్కులు ధరించడం కూడా మానేశారు. ఈ తరుణంలో వివాహానికి హాజరైన వారిలో ఒక వ్యక్తికి పాజిటివ్ ఉండడం, అతనికి తెలియకుండా వివాహానికి హాజరవ్వడంతో అక్కడకు వచ్చిన మిగిలిన వారందరికీ ఈ వైరస్ సోకినట్టుగా తెలుస్తుంది.

వివాహానికి హాజరైన మరుసటి రోజు నుంచే జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉండటంతో కొంతమంది వెళ్ళి ఆర్టీపీసీఆర్ ద్వారా చెకప్ చేసుకోగా పాజిటివ్ అని తేలడం, వారు వివాహానికి హాజరైనట్లు వైద్య సిబ్బంది దృష్టికి తీసుకెళ్ళడంతో వెంటనే అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం వివాహానికి హాజరైన అందరికీ పరీక్షలు చేసి 40 మందికి కరోనా సోకినట్లు నిర్థారించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •