టెక్నాలజీ (Technology) వార్తలు (News)

డిగ్రీ అర్హతతో సైన్యంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్??

భారత సైన్యంలో చేరాలనుకునే వారి కోసం నాన్ డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కి భారత టెరిటోరియల్‌ ఆర్మీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 20 నుంచి ఆగస్టు 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు లెఫ్టినెంట్ హోదా కల్పించనున్నారు. సాధారణ ఆర్మీ అధికారులకు ఉన్నట్టుగా వీరికి కూడా అవే అధికారాలు, శాలరీ, అలవెన్సులు అందిస్తారు. ఏడాదిలో రెండు నెలల తప్పనిసరి శిక్షణ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు రూ.56,100 నుంచి 1,77,500 వరకు శాలరీ ఇవ్వనున్నారు.

అర్హతలు: ఆగస్టు 19, 2001 నాటికి 18 సంవత్సరాలు నుండి 42 ఏండ్లలోపు వారు అయి ఉండాలి. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

దరఖాస్తు చేయాలంటే: ముందుగా భారత టెరిటోరియల్‌ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి హోం పేజిలోని ఆర్మీ రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌, ఇతర వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి.
రిజిస్టర్ చేసుకున్నాక ఒక రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ జనరేట్ అవుతుంది. వాటి ఆధారంగా దరఖాస్తు నింపాలి. ఫొటో, సంతకం స్కాన్‌డ్ కాపీలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు కోసం రూ.200 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అలాగే దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత డౌన్‌లోడ్ చేసుకోవడం మరిచిపోవద్దు.

ఎంపిక విధానం: రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది. రాత పరీక్ష రెండు భాగాలుగా ఆఫ్‌లైన్ విధానంలో జరుగుతుంది. మొదటి పేపర్‌లో రీజనింగ్‌, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్ ఉంటాయి. ఇక రెండో పేపర్‌లో జనరల్ నాలెడ్జ్‌, ఇంగ్లీష్ ఉంటాయి. మొత్తం రెండు వందల మార్కులకు ఈ పేపర్ ఉంటుంది. ఒక్కో పేపర్‌కు రెండు గంటల సమయం ఇస్తారు. రాత పరీక్షలో క్వాలిఫై అవ్వాలంటే కనీసం 40 శాతం మార్కులు రావాలి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •