ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) జాతీయం (National) వార్తలు (News)

నిరాటంకంగా మైలురాళ్లను దాటుతున్న టీకా కార్యక్రమం!!

టీకా కార్యక్రమ ప్రారంభంలో మొదటి పది కోట్ల డోసులు వేయడానికి 85 రోజులు పట్టగా సవరించిన టీకా విధానం అమల్లోకి వచ్చిన 24 రోజుల్లో కేంద్రం మరో 10 కోట్ల మందికి టీకాలు వేసింది. భారత్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన టీకా కార్యక్రమం ప్రధాని మోదీ నాయకత్వంలో నిరాటంకంగా సాగుతూ మైలురాళ్లను దాటుతోంది అని మన్‌సుఖ్ ట్విటర్ వేదికగా వెల్లడించారు.

కరోనా కట్టడికి కేంద్రం జనవరి 16న టీకా కార్యక్రమాన్ని ప్రారంభించి, 18 ఏళ్లుపైబడిన ప్రతిఒక్కరికి ఉచితంగా టీకాలు వేయాలనే లక్ష్యంతో కొత్త టీకా విధానాన్ని జూన్ 21 నుంచి అమల్లోకి తెచ్చింది. దీని కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రమే ఉచితంగా టీకా డోసులు అందజేస్తోంది. అందుకోసం టీకా ఉత్పత్తిలో 75 శాతం ప్రభుత్వం కొనుగోలు చేస్తుండగా 25 శాతం డోసుల్ని ప్రైవేటు ఆసుపత్రులు సేకరిస్తున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •