టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

వర్క్ ఫ్రమ్ హోం ఇంకా ఎన్నాళ్ళు.. సర్వే లు ఏంచెప్తున్నాయి?

కోవిడ్-19 నేపథ్యంలో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు మొగ్గుచూపుతున్నాయి. దీంతో ఉద్యోగులంతా ఇంటి వద్ద నుంచే సేవలను అందిస్తున్న నేపథ్యంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా సంస్థలు మాత్రం ప్రయోజనం పొందుతున్నాయి. మెయింటెనెన్స్, ఇతర ఖర్చులు భారీగా తగ్గి ఉత్పత్తి పెరిగింది. ఇదిలా ఉండగా, థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం మరికొన్ని రోజులు కొనసాగుతుందన్న అంచనాలు ఉన్న నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎన్నాళ్లు కొనసాగుతుందనే అంశంపై చెన్నై కేంద్రంగా పనిచేసే జోహో కార్పొరేషన్‌ ఓ సర్వే నిర్వహించగా దానిలో పలు ఆసక్తి కరమైన విషయాలు వెల్లడయ్యాయి.

భారత్‌లోని 95 శాతానికిపైగా సంస్థలు మరో రెండేళ్ల పాటు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని కొనసాగించే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమయ్యింది. ఈ సర్వేలో ఉత్తర అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, భారత్‌కు చెందిన 1,210 మంది ఐటీ ఎగ్జిక్యూటివ్స్, టెక్నాలజీ ప్రొఫెషనల్స్ పాల్గొనగా భారత్ నుంచి 500లకుపైగా ఉద్యోగులున్న 202 సంస్థల ప్రతినిధులు ఇందులో ఉన్నారు. అయితే, వర్క్ ఫ్రమ్ హోం విధానం వల్ల తమ సంస్థలకు భద్రతా పరమైన సవాళ్లు పెరిగినట్టు 89 శాతం మంది అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా ఐటీ రంగానికి ఈ ముప్పు ఎక్కువగా ఉన్నట్టు, కోవిడ్ -19 మహమ్మారి కారణంగా కనీసం 97 శాతం కంపెనీలు క్లౌడ్ సొల్యూషన్స్‌పై ఆధారపడుతూనే వ్యాపార విశ్లేషణలు, కృత్రిమ మేధస్సులో పెరుగుదల కనిపించిందని 96 శాతం మంది చెప్పారు. 10 మందిలో తొమ్మిది మందికి పైగా అధికారులు, ఐటీ నిపుణులు మహమ్మారి వల్ల క్లౌడ్ కంప్యూటింగ్ వాడకం పెరిగిందని తెలిపారు. కృత్రిమ మేధస్సుపై విశ్వాసం పెరిగినట్లు 91 శాతం కంపెనీలు వివరించాయి. మంచి ఫలితాలను పొందినట్టు 89 శాతం సంస్థలు పేర్కొన్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •