జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

డిగ్రీ అర్హతతో 650 అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాలు!!

ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ) 650 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ మొదట ఐడీబీఐ మణిపాల్‌ (బెంగళూరు), నిట్టే (గ్రేటర్‌ నోయిడా) విద్యా సంస్థలతో కలిసి ఏడాది (9 నెలలు క్లాస్‌ రూం+3 నెలలు ఇంటర్న్‌షిప్) వ్యవధి గల పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌(పీజీడీబీఎఫ్)లో శిక్షణ ఇస్తుంది. పూర్తి వివరాలకు అభ్యర్థులు https://www.idbibank.in/ వెబ్‌సైట్‌ చూడవచ్చు.
మొత్తం ఖాళీలు: 650
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా (డిగ్రీ) గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 2021 జూలై 01 నాటికి 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: దీన్ని మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే 0.25 చొప్పున మార్కు కట్‌ చేస్తారు. పరీక్షలో లాజికల్‌ రీజనింగ్‌, డేటా అనాలిసిస్‌, ఇంటర్‌ప్రిటేషన్‌ నుంచి 60 ప్రశ్నలు; ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ నుంచి 40; క్వాంటిటేటీవ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 40; జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌ నుంచి 40 ప్రశ్నలు వస్తాయి.

జీతం: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలం (9 నెలలు)లో నెలకు రూ.2500 చెల్లిస్తారు. ఇంటర్న్‌షిప్‌ (3 నెలలు) సమయంలో నెలకు రూ.10 వేలు చెల్లిస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరిన వారికి మొదటి నెల నుంచి రూ.36,000 నుంచి రూ.49,910 వరకు అందుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.200, ఇతరులు రూ.1000 చెల్లించాలి.
దరఖాస్తుకి చివరి తేదీ: ఆగస్టు 22, 2021
పరీక్ష తేదీ: సెప్టెంబర్‌ 04, 2021
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:
ఆంధ్రప్రదేశ్‌: విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, చీరాల, కాకినాడ, చిత్తూరు, ఏలూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం, తిరుపతి.
తెలంగాణ: హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •