ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

12 ఏళ్లు దాటిన వారికి కూడా అందుబాటులోకి మరో వ్యాక్సిన్‌??

దేశంలో కరోనా వైరస్‌ మూడో దశ రానుందన్న ఆందోళనలు చెలరేగడంతో జైడస్ కాడిల్లాకు చెందిన జైకోవ్‌-డీ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి ప్రభుత్వ డ్రగ్‌ ప్యానెల్‌ అనుతిమినిచ్చింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్ఓ) సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ (ఎస్‌ఇసి) జైడస్ మూడు డోసుల వ్యాక్సిన్‌కు ఆమోదం తెలుపుతూ తుది ఆమోదం కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు సిఫార్సు చేసింది. దీనికి డీజీసీఐ కూడా అనుతినివ్వడంతో భారత్‌లో అందుబాటులోకి వచ్చిన రెండవ దేశీ వ్యాక్సిన్‌గా జైకోవ్‌-డీ నిలవనుంది. దీనికి మరొక విశేషం కూడా ఉంది అదేంటంటే.. దేశంలో 12 ఏళ్లు దాటిన వారికి అందుబాటులోకి వచ్చిన తొలి టీకా గా దీనిని చెప్పవచ్చు.

అహ్మదాబాద్‌కు చెందిన ఫార్మా సంస్థ జైడస్ క్యాడిలా జైకోవ్-డి పేరుతో ఈ వ్యాక్సిన్‌ను దేశీయంగా అభివృద్ధి చేసింది. ఇది మూడు డోసుల టీకా. (మొదటి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోస్​, 45 రోజుల తర్వాత మూడో డోస్​) వ్యాక్సిన్​. సూది లేకుండా ఇంట్రాడెర్మల్​ ప్లాస్మిడ్​ డీఎన్​రే టీకా వల్ల యాంటీ బాడీలు ఎక్కువ కాలం శరీరంలో ఉంటాయని, అలాగే సైడ్‌ ఎఫెక్ట్స్ కూడా తక్కేనని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •